Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

లోకేశ్ రాకతో గోరంట్లలో భారీ ప్రజాస్పందన

Gorantla flooded with crowds to see Nara Lokesh
Advertisement
  • కొనసాగుతున్న నారా లోకేశ్ యువగళం పాదయాత్ర
  • నేడు పెనుకొండ నియోజకవర్గంలో పాదయాత్ర
  • ఈ ఉదయం రెడ్డికట్టచెరువు విడిది కేంద్రం నుంచి పాదయాత్ర ప్రారంభం
  • మధ్యాహ్నం తిప్పరాజుపల్లిలో భోజన విరామం
  • అక్కడ్నించి గోరంట్ల చేరుకున్న లోకేశ్
  • జనసంద్రంలా మారిన గోరంట్ల
Advertisement
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర పుట్టపర్తి నియోజకవర్గం నుంచి పెనుకొండ నియోజకవర్గంలోకి ప్రవేశించింది. ఈ ఉదయం లోకేశ్ పాదయాత్ర కొండాపురం పంచాయతీ రెడ్డిచెరువుకట్ట విడిది కేంద్రం నుంచి ప్రారంభమైంది. 

ఈ క్రమంలో వివిధ వర్గాలతో భేటీ అవుతూ, వారి సమస్యలు తెలుసుకుంటూ, హామీలు ఇస్తూ లోకేశ్ ముందుకు కదిలారు. మధ్యాహ్నం తిప్పరాజుపల్లి వద్ద భోజన విరామం తీసుకున్న లోకేశ్... అక్కడ్నించి గోరంట్ల చేరుకున్నారు. పెనుకొండ నియోజకవర్గం గోరంట్లలో లోకేశ్ కు అపూర్వ స్వాగతం లభించింది. 

పార్టీ శ్రేణులు భారీగా తరలిరావడంతో గోరంట్ల పట్టణం జనసంద్రమైంది. లోకేశ ను చూసేందుకు ప్రజలు భారీ రోడ్లపైకి వచ్చారు. సమీపంలో ఉన్న భవనాల మీదికి ఎక్కారు. అందరికీ అభివాదం చేస్తూ, ఆప్యాయంగా పలకరిస్తూ లోకేశ్ ముందుకు సాగారు.
Advertisement
Advertisement
Nara Lokesh
Gorantla
Yuva Galam Padayatra
TDP
Penukonda
Sri Sathyasai District

More Telugu News